హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను గురువారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 24న ఇంటర్ మొదటి సంవత్సరం, 25న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నట్టు బోర్డు స్పష్టంచేసింది. సెకండ్ ఇయర్ సైన్స్ సబ్జెక్టులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఫస్ట్ ఇయర్ సైన్స్ సబ్జెక్టులకు(కొత్త ప్యాటర్న్ ప్రకారం) ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు మూడు సెషన్లలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 29న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జనవరి 30న నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు