చేవెళ్ల : ఆర్మీ వ్యాన్ బోల్తాపడిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేవెళ్ల మండల పరిధి అల్లవాడ గ్రామ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా ( Army van overturns ) పడింది. అందులో ప్రయాణిస్తున్న జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు( Jawans seriously injured ) అందులో ఎనిమిది మంది జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
చికిత్స నిమిత్తం గోల్కొండ దవాఖానకు తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సింది. ఎదురుగా వస్తున్న మరో కారును తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. డ్రైవింగ్ ట్రైనింగ్ లో ఉన్న హవల్దార్ అవిందర్ తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు.ప్రస్తుతానికి అందరి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.