సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, విద్యార్థి విభాగం నాయకులను ముందస్తుగా ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తూ ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. సిద్దిపేటలో అభివృద్ధి పనుల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు నిధులు రూ. 1070 కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమ అరెస్ట్ లు చేసిన ప్రశ్నిస్తూనే ఉంటమని స్పష్టం చేశారు.

