Balmoor Venkat:తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బల్మూరి వెంకట్‌తో పాటు ఆయన సతీమణి స్వల్ప గాయాలతో పెను ముప్పు నుంచి సురక్షితంగా బయటపడ్డారు
వివరాల్లోకి వెళ్తే.. బల్మూరి వెంకట్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తూరు బైపాస్‌లోని దర్గా చౌరస్తా సమీపంలోకి రాగానే, వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కోళ్ల లోడు డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాద సమయంలో కారులో బల్మూరి వెంకట్ దంపతులతో పాటు ఆయన సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. ఈ ఘటనలో వెంకట్ దంపతులకు స్వల్ప గాయాలు కాగా, సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడటంతో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.