షేర్: f 𝕏 ✉ ✈ in @
andhravibes.in 18 నవం 2026, 7:17 ఉద.
క్రైమ్ వార్తలు

ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సర్పంచ్‌

Andhra Pradesh news and culture in Telugu
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 7:17 ఉద. రచన: One News Desk
6 వీక్షణలు 0 వ్యాఖ్యలు
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సర్పంచ్‌

మహబూబాబాద్‌ : జిల్లాలోని సీరోల్‌ మండలం మోదుగడ్డ తండాకు చెందిన సర్పంచ్‌ దరావత్‌ వీరు( Sarpanch Daravath Veeru) లంచం ( Bribe) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న క్వారీ నిర్వహణ కోసం ఎలాంటి అడ్డంకులు సృష్టి్ంచవద్దని గ్రానైట్‌ యజమానులు సర్పంచ్‌ను సంప్రదించారు.

అందుకు మొదట రూ.30 లక్షలు డిమాండ్‌ చేసిన సర్పంచ్‌ చివరకు రూ.13 లక్షలకు ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు బుధవారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డ సర్పంచ్‌ దరావత్‌ వీరుపై కేసు నమోదు చేసి వరంగల్‌ జుడిషియల్‌ కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ ఉన్నతాధికారులు వివరించారు.

#క్రైమ్వార్తలు
మహబూబాబాద్‌ : జిల్లాలోని సీరోల్‌ మండలం మోదుగడ్డ తండాకు చెందిన సర్పంచ్‌ దరావత్‌ వీరు( Sarpanch Daravath Veeru) లంచం ( Bribe) తీసుకుంటూ ఏసీబీ ( ACB )…